రాయ్‌పూర్ : కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడి విషయం తనని తీవ్ర దిగ్భాంతికి లోను చేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని, ఈ చర్యను తాను ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నేరం చేసిన వారిని సత్వరం నిర్బంధించి కఠిన శిక్ష విధించాలని ఆయన అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.




