Monday, 2 November 2026

మా ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

2

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి

హైదరాబాద్‌,డిసెంబర్‌29(జనంసాక్షి): ఎంసెట్‌పై మళ్లీ పీటముడి పడేలా కనిపిస్తోంది. దీనిని తెలంగాణలో  తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. మరోవారంలో ఎంసెట్‌ ఇతర సెట్ల తేదీలను ప్రకటిస్తామన్నారు. తమ పరీక్షల వ్యవహారాల్లో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిని సహించబోమన్నారు. ఈ పరీక్షలను సొంతంగా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు గతంలోనే తాము ప్రకటించామన్నారు. ఈ దశలో తిరిగి ఏకపక్షంగా పరీక్షల తేదీని ఎట్లా ప్రకటిస్తారని పాపిరెడ్డి ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని  పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ఉన్నత విద్యామండలి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్‌ తామే నిర్వహించుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. విభజన చట్టం ప్రకారమే ఎంసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్‌కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారని, తర్వలోనే అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి పరీక్ష తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు తెలుగు రాష్టాల్ల్రో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి పరీక్షల తేదీలను ప్రకటించారు. మే 10న ఎంసెట్‌, మే 14న ఈసెట్‌, మే 16న ఐసెట్‌, మే 28న ఎడ్‌సెట్‌, మే 30న లాసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ పక్రియ నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే  వివిధ ఉమ్మడి పరీక్షలకు షెడ్యూల్‌ ను విడుదల చేస్తున్నట్లు వేణుగోపాలరెడ్డి ప్రకటించారు. దీని ప్రకారం ఇంజనీరింగ్‌ ,వైద్య విద్య కోర్సుల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ను ( ఎమ్సెట్‌) వచ్చే ఏడాది మే పది న నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వాటితో పాటు లాసెట్‌,ఐసెట్‌ తదితర సెట్‌ లన్ని మే నెలలోనే పూర్తి చేస్తామని, జాతీయ పరీక్షలకు ఇబ్బంది లేని రీతిలో వీటిని నిర్వహిస్తున్నామని అన్నారు. ఉమ్మడి పరీక్షలకు విభజన చట్టం అనుమతిస్తోందని, దీని ప్రకారం తాము బాధ్యత నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.పదో షెడ్యూల్‌ ఉన్న సంస్థకు అధికారాలు ఉంటాయని, మిగిలిన వాటికి అదికారం ఉండదని, పదేళ్లపాటు ఉమ్మడి విద్య ఉంటుందని, ఆడ్వకేట్‌ జనరల్‌ అబిప్రాయం తీసుకున్నాకే ఈ బాద్యత ఎపికే ఉంటుందని స్పష్టం

అయిందని వేణుగోపాల రెడ్డి చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం విడిగా ఎమ్సెట్‌ పెట్టుకోవాలని భావిస్తున్న తరుణంలో వేణుగోపాలరెడ్డి ఈ ప్రకటన చేయడం విశేషం.రెండు రాష్టాల్ర మధ్య మళ్లీ ఇది వివాదం కాబోతోంది. ఇంటర్‌తో పాటు ఎంసెట్‌ సొంతంగా నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకున్నా ఆంధ్రా ప్రభుత్వం తీరు మారలేదు. తెలంగాణ విద్యార్థులపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తోందన్న విమర్శలువచ్చాయి. ఉమ్మడి పరీక్ష తేదీలు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రా ఉన్నత విద్యామండలి ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితిని తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి సవిూక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *