– బాబుకు కేసీఆర్ ఆహ్వానం
చంద్రబాబకు ఆహ్వాన పత్రిక అందచేసిన కెసిఆర్
సాదర స్వాగతం పలికిన బాబు
విజయవాడ,డిసెంబర్14(జనంసాక్షి): అయుత చండీయాగానికి రావాల్సిందిగా తెలంగాణ సిఎం కెసిఆర్ స్వయంగా వెలల్‌ఇ ఎపి సిఎం చంద్రబాబును ఆహ్వానించారు. తానునిర్వహించే యాగానికి సంబంధించి ఆహ్వాన పత్రికను బాబుకు అందించారు. ఈ మేరకు సోమవారం కెసిఆర్ మంతరి ఈటెల రాజేందర్, ఎంపి బాల్క సుమన్‌లో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడ వెళ్లారు. వీరికి చంద్రబాబు స్వయంగా సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేకహెలికాప్టర్‌లో కృష్ణా తీరం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఎపి మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు కేసీఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. తన నివాసానికి రాగానే కేసీఆర్‌ను చంద్రబాబు బొకేతో సాదరంగా ఆహ్వానించారు. అయుత చండీయాగానికి తనను ఆహ్వానించేందుకు తన నివాసానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు.ఆంధ్రా ప్రత్యేకతగా నిలిచే పలు వంటకాలతో కేసీఆర్‌కు విందు ఏర్పాటుచేశారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి సహా 15 రకాల వంటకాలను విందు కోసం ప్రత్యేకంగా తయారుచేయించారు. సిఎం బాబు నివాసంలో చంద్రబాబుకు శాలువా కప్పి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందచేశారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడ పర్యటన ముగిసింది. తన పర్యటనను ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్న భోజనం ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇరువురు నేతలు సుమారు గంట 35 నిమిషాలపాటు సమావేశమయ్యారు.





