మిల్లర్‌ ‘ఛాలెంజ్‌’

38 బంతుల్లో మెరుపు శతకం
ఓడిన బెంగళూరు
పంజాబ్‌ ఘన విజయం
బెంగళూరు మే 6 (జనంసాక్షి):
బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఎలవెన్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా చక్కని బ్యాటింగ్‌ చేశాడు. 48 బంతుల్లో 51 పరుగులు చేసి గోని బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రిస్‌ గేల్‌ దూకుడుగా ఆడి 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు. గోని బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి వెనుదిరిగాడు. విరాట్‌ కొహ్లీ 14 బంతులు ఆడి 14, డివిల్లర్స్‌ 19 బంతుల్లో 38 (నాటౌట్‌), హెన్రిక్యూస్‌ 7 బంతుల్లో 16 పరుగులు చేశారు. పంజాబ్‌ జట్టులో గోని 2, అవానా 1 వికెట్‌ తీశారు. 191 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో 194 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ మనిదీప్‌ సింగ్‌ 12 బంతుల్లో 16 పరుగులు చేసి వినయ్‌కుమార్‌ బౌలింగ్‌లో అరుణ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మార్ష్‌ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్వలేక పోయాడు. 7 బంతులు 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రామ్‌పాల్‌ బౌలింగ్‌లో డివిల్లర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గురుకీరత్‌ సింగ్‌ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేక పోయాడు. 20 బంతుల్లో 20 పరుగులు చేసి వికెట్‌ చేజార్చుకున్నాడు. కార్తీక్‌ విసిరిన బంతికి ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. హుస్సే కూడా 13 బంతులకే ఔటయ్యాడు.
ఓ దశలో 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న పంజాబ్‌ను మిల్లర్‌ 38 బంతుల్లో (101, 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శతకంతో జట్టును గెలిపించి నాటౌట్‌గా మిగిలాడు. సతీశ్‌ 27 బంతుల్లో 18 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. బెంగళూరు జట్టులో కార్తీక్‌ 2, రామ్‌పాల్‌, వినయ్‌కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌:
బ్యాటింగ్‌: మణిదీప్‌ సింగ్‌ 16(4I3 6I0) (క్యా) కార్తిక్‌ (బౌ)వినయ్‌కుమార్‌, ఎస్‌ఇ మార్ష్‌ 6(4I1 6I0) (క్యా)డివిలియర్స్‌ (బౌ) రవిరాం పాల్‌, డెవిడ్‌హస్సీ 13(4I1 6I0) (క్యా) హెన్రిక్స్‌ (బౌ)కార్తీక్‌, డేవిడ్‌ మిల్లర్‌101 (4I8 6I7) (నాటౌట్‌), రాజగోపాల్‌ సతీష్‌(27) (4I2 6I1) (నాటౌట్‌).
మొత్తం: 194/4 రన్‌రేట్‌: 10.78
ఎక్స్‌ట్రాలు: 11 (బైస్‌-4, వైడ్‌లు-4, నోబాల్‌-1 , లెగ్‌బైస్‌-2, పెనాల్టీ-0)
వికెట్ల పతనం: 1-13(2.3), 2-25(4.2), 3-51 (7.4), 4-64 (9.5)
బెంగుళూర్‌ బౌలింగ్‌ : రవిరాంపాల్‌ 4-0-27-1, ఆర్పీసింగ్‌ 3-0-38-0, హెన్రిక్స్‌ 3-0-29-0, వినయ్‌కుమార్‌ 4-0-48-1, కార్తీక్‌ 3-0-24-2, గేల్‌ 1-0-22-0
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూర్‌:
బ్యాటింగ్‌: ఛటేశ్వర్‌ పుజారా 51(4I8 6I0) (బౌ) గోని, గేల్‌ 61(4I6 6I3) (బౌ) గోనీ, విరాట్‌ కోహ్లీ 14(4I1 6I0) (సి) మార్ష్‌ (బౌ)అవానా, డివిలియర్స్‌(38) (4I4 6I2) (నాటౌట్‌), హెన్రిక్స్‌ 16(4I2 6I1) (నాటౌట్‌)
మొత్తం: 190/3 (20.0) రన్‌రేట్‌ : 9.50
ఎక్స్‌ట్రాలు:10 (బైస్‌-0, వైడ్‌లు-4, నోబాల్‌-1, లెగ్‌బైస్‌-5, పెనాల్టీ-0)
వికెట్ల పతనం : 1-102(11.2), 2-133 (15.1), 3-144(16.5)
పంజాబ్‌ బౌలింగ్‌: ప్రవీణ్‌్‌ 4-0-28-0, అవానా 4-0-28-1, గోని 4-0-41-2, చావ్లా 4-0-26-0.

 

తాజావార్తలు