Monday, 2 November 2026

మిషన్‌ భగీరథ భేష్‌

C
– కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్‌ను అభినందించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): మిషన్‌ భగీరథలో భాగంగా.. 40 వేల కోట్లతో ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ చేపట్టిందన్నారు. తొలిదశగా ఈ ఎప్రిల్లో నీరు అందించబోతున్నామని అన్నారు.  బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ మిషన్‌ భగీరథపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మిషన్‌ భగీరథ ప్రజెంటేషన్ను కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్‌, ఇతర రాష్టాల్ర మంత్రులు, అధికారులు అభినందించారు. హస్తినలోని విజ్ఞాన భవన్‌లో కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌, నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌పై సదస్సుకు జరిగింది. సదస్సుకు కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్‌, 8 రాష్ట్రాల మంత్రులతో పాటు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మిషన్‌ భగీరథపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణ విజన్‌, మిషన్‌ భగీరథపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌పై కేటీఆర్‌కు ప్రశంసలు వెలువెత్తాయి. మంత్రి కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చౌదరి బీరేంద్రసింగ్‌, పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తిగా విన్నారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్‌ నాటికి తొలి దశలో 10 నియోజకవర్గాల్లో రక్షిత మంచినీరు అందిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. పనుల్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడుతున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. మిషన్‌ భగీరథపై మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌ బాగుందని కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ ప్రశంసించారు. సాధారణంగా ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తుంటారు. రాజకీయ నేతలు ఆ ప్రజెంటేషన్‌ను చూస్తుంటారు. కానీ యువమంత్రి కేటీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అధికారులను మించారు. తన ప్రజెంటేషన్‌తో అందరినీ ఆకర్షించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *