Wednesday, 4 November 2026

మీడియా ప్రకటనలపై సుప్రీం మార్గదర్శకాలు

1

న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి):

విూడియా ప్రకటనల్లో మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. రాజకీయ నేతలు తమ ఫోటోలతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం మార్గదర్శకులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో  రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తుల పోటోలు మాత్రమే ఉండాలని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  వివిధ విూడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై  సుప్రీం కోర్టు బుధవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  దీనికి సంబంధించి త్రి సభ్య కమిటీని వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ఆయా ప్రకటనల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ  నియమించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఫోటోలు కూడా వాడరాదని స్పష్టం చేసినట్టయింది. ప్రభుత్వం ప్రకటనల పేరుతో  రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగంతో ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన  ధర్మాససం ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోల వాడకాన్ని నిషేధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *