మీరు బిల్లు పెట్టండి మేం బేషరతుగా మద్దతిస్తాం
తెలంగాణ ఆపడం ఎవరితరం కాదు : రాజ్‌నాథ్‌సింగ్
నగార సమితి భాజపాలో విలీనం
‘నాగం’ బీజేపీ తీర్థం
హైదరాబాద్, జన్ 3 (జనంసాక్షి) :
‘మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టండి. మేం బేషరతుగా మద్దతిస్తాం’ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సోమవారం నగరంలోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ నగార సమితి వ్యవస్థాపకుడు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి సహా ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నగారా సమితిని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ, యూపీఏ సర్కారు అన్ని రంగాల్ల విఫలం అయిందని నిప్పులు చెరిగారు. ఏం సాధించారని నాలుగేళ్ల పాలనా వార్షికోత్సవాలు నిర్వహించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్టాన్న్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని పునరుద్ఘాటించారు. మావోయిస్టుల సమస్యను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆహార భద్రత, భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు తామఉ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీటి ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాలు అక్కర్లేదని తెలిపారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమమైందని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని రాజ్‌నాథ్ ప్రశ్నించారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం గత నెలలో మిత్రపక్షాలకు ఏర్పాటు చేసిన విందును ప్రస్తావిస్తూ.. ‘ఏం చేశారని వేడుకలు నిర్వహించుకుంటున్నారు? నిత్యావసరాల ధరల పెరిగినందుకు విందు చేసుకుంటున్నారా? అవినీతి పెచ్చరిల్లిందని వేడుక చేసుకుంటున్నారా?’ అని నిలదీశారు.
అధికారంలోకి రాగానే తెలంగాణ
తాము అధికారంలోకి రాగానే తెలంగాణ సహా మూడు రాష్టాల్రను ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారని.. తొమ్మిదేళ్లు గడిచినా దాన్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న హావిూని యూపీఏ విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ ఇస్తామని ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లోనూ పేర్కొందని.. పార్లమెంట్లో కూడా ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కు తగ్గారని ధ్వజమెత్తారు. తాము మాత్రం 2014లో అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామన్నారు. ఒకసారి హావిూ ఇస్తే.. ఎంత కష్టమైనా వెనక్కు తగ్గొద్దని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని పునరుద్ఘాటించారు. గతంలో మూడు రాష్టాల్రు ఏర్పాటు చేసిన ఘనత తమదేనని ఇచ్చిన మాట తప్పడం బీజేపీ రాజకీయ చరిత్రలో లేదన్నారు. టీఆర్ఎస్పై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.
అన్ని రంగాల్లో యూపీఏ విఫలం
యూపీఏ అన్ని రంగాల్లో విఫలమైందని రాజ్‌నాథ్ విమర్శించారు. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం బలహీనపడిరదన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. పాక్ జవాన్లు భారత సైనికుల తలలు నరుక్కొని తీసుకెళ్లినా ఈ ప్రభుత్వంలో చలనం కూడా లేదని నిప్పులు చెరిగారు. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకువస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. మన దేశ విదేశాంగ మంత్రి మాత్రం చైనా పర్యటన కోసం తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వేడుక నిర్వహించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించిందని, ద్రవ్యలోటు పెరిగిపోయి సంక్షోభం నెలకొందని చెప్పారు. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మావోల సమస్యనూ రాజకీయం చేస్తారా?
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నరమేధాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపేందుకు కేంద్రం యత్నిస్తోందని రాజ్‌నాథ్ విమర్శించారు. మావోయిస్టుల నరమేధాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మావోయిస్టుల సమస్య పరిష్కారం కోసం యూపీఏ వద్ద ఎలాంటి కార్యాచరణ లేదని ఆరోపించారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. ‘కేంద్రం నక్సల్ సమస్యను శాంతభద్రతల సమస్యగా పరిగణిస్తూ.. రాష్టాల్రపైకి నెడుతోంది. ఛత్తీసగఢ్లో మావోయిస్టుల నరమేధాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టాలని యత్నిస్తోంది. మావోల సమస్యను రాజకీయం చేస్తోంది’ అని ధ్వజమెత్తారు. శాంతిభద్రతల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కానీ నక్సల్స్ సమస్య జాతీయ సమస్య అని తెలిపారు.
తప్పులు ఎత్తి చూపే బాధ్యత మాది
పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని తమను విమర్శించడం తగదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పడు, తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత తమపై ఉందని.. వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు యత్నించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ‘కేంద్ర న్యాయ మంత్రి, రైల్వే శాఖ మంత్రి రాజీనామాలు చేయాలని మేం అడిగినప్పుడే చేయించే ఉంటే.. కీలక బిల్లులు (ఆహార భద్రత, భూసేకరణ) ఆమోదం పొంది ఉండేవి కదా?’ అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించాలని కోరడం తప్పా? అని పేర్కొన్నారు. ఆహార భద్రత, భూసేకరణ బిల్లులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవినీతి మంత్రులతో కేవలం రాజీనామాలు చేయించి ప్రభుత్వం తప్పుకుందని.. అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆహార భద్రత, భూసేకరణపై ప్రత్యేక సమావేశాలు అవసరం లేదని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. వర్షాకాల సమావేశాల్లోనే వాటిని ఆమోదించవచ్చన్నారు.
అద్వానీ వ్యాఖ్యలు వక్రీకరించారు
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీల మధ్య విభేదాలు లేవని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అద్వానీ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చే సమయానికే గుజరాత్ అభివృద్ధి చెందిందని.. అయితే, 2005లో శివరాజ్ చౌహన్ పగ్గాలు చేపట్టే నాటికి మధ్యప్రదేశ్ అభివృద్ధి లేక, పేదరికంతో కొట్టుమిట్టాడుతోందని అలాంటి రాష్టాన్న్రి శివరాజ్ చౌహన్ అభివృద్ధి బాట పట్టించారని అద్వానీ రెండ్రోజుల క్రితం ప్రశంసించారు. అలాగే, చౌహన్‌ను చూస్తే వాజ్‌పేయిని చూసినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. చౌహన్‌ను ప్రశంసించడం ద్వారా మోడీని తక్కువ చేసి చూపారని… మోడీ, అద్వానీ మధ్య విభేదాలకు తాజా వ్యాఖ్యలు నిదర్శనమని వార్తలు వెల్లువెత్తాయి. అయితే, ఆ వార్తలను రాజ్‌నాథ్ తోసిపుచ్చారు. అద్వానీ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. ‘మోడీ దేశంలోనే ప్రజాదరణ ఉన్న నేత.. చౌహన్ కూడా మధ్యప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేశారు. అదే విషయాన్ని అద్వానీ చెప్పారని’ అన్నారు.