జయలలిత కేసులో సుప్రీం కోర్టు స్పష్టీకరణ
దిల్లీ డిసెంబర్11 (జనంసాక్షి) :: ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి తమ వాదనలను ముందుగా వినాలన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. గతంలో నిర్ణయించినట్టుగా డిసెంబరు 18న విచారణ ఉంటుందని పేర్కొంది. ఇదే కేసులో ఆమెకు కర్ణాటక హైకోర్టు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై అక్టోబరు 17న ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఏఐఏడీఎంకే నేత జయలలితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను రెండు నెలల్లో కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలా సమర్పించని పక్షంలో ఒక్కరోజుకూడా బెయిల్‌ను పొడిగించలేమని చెబుతూ విచారణను డిసెంబరు 18కి వాయిదావేసింది. అయితే విచారణను ముందుకు జరపాలంటూ సీనియర్ న్యాయవాది నారీమన్ జయలలిత తరఫÛన పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు.





