ముంపు రక్షణకు డ్రైనేజీ కల్పించాలి
ఏలూరు,ఆగస్ట్13(జనం సాక్షి ): రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర డిప్యూటీ తహశీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ముందుగా పెనుమంట్ర మండలంలో పెనుమంట్ర నుంచి జుత్తిగ వెళ్ళే రోడ్డు పక్కనే వర్షాల ముంపుకు గురైన వరి పొలాలను రైతు సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం పరిశీలించారు. అనంతరం పెనుమంట్ర మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద ముంపునకు గురైన వరి చేనులకు వెంటనే డ్రయినేజ్ సదుపాయం కల్పించాలని డిప్యూటీ తహశీల్దార్ కె.సాంబశివమూర్తికి రైతు సంఘం జిల్లా డెల్టా కార్యదర్శి ఆకుల హరేరాం, రైతులు వినతిపత్రం అందజేశారు.