Monday, 2 November 2026

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ క్యాంపు కార్యాలయంలో జర్మన్‌ రాయబారి మార్టిన్‌

05-0ct-099ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ క్యాంపు కార్యాలయంలో జర్మన్‌ రాయబారి మార్టిన్‌ కలిశారు. ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జర్మన్‌ రాయబారి మార్టిన్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక, ఐటీ విధానాలు, టీహబ్‌ గురించి మార్టిన్‌కు వివరించారు. జర్మనీలో కొనసాగుతున్న విద్యావిధానం గురించి మార్టిన్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. జర్మన్‌ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చూస్తామని మార్టిన్‌ సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *