Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి తనయుడు హరీశ్‌ రావు మధ్య అధిపత్య పోరు?

2ruhiu6qటీఆర్‌ఎస్‌  ప్లీనరీ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనల్లుడు, రాష్ట్ర  మంత్రి టి. హరీశ్‌రావు వెనక వరసులో కూర్చోవటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పటి నుంచి పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా హరీశ్‌రావుకు పేరుంది.  మెదక్‌ జిల్లా సిద్ధిపేట అసెంబ్లీ  స్థానంలో ఓటమన్నది ఎరగకుండా భారీ మెజార్టీతో గెలుస్తునే ఉన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా  కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయా స్థానాల్లో ఇన్‌చార్జీగా వ్యవహరించి ప్రతి చోట పార్టీ అభ్యర్థిని గెలిపిస్తూ లక్కీ హ్యాండ్‌గా ముద్ర వేసుకున్నారు.  పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో కానీ టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లులో మంత్రి హరీశ్‌రావుకు భాగస్వామ్యం లేకుండా పోయిందనే ప్రచారం జరిగింది.  ఎందకుంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది.

ప్లీనరీతోపాటు  27న పార్టీ ఆవిర్భావ దినం సందర్బంగా జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కమిటీల్లోనూ హరీశ్‌కు భాద్యతలు ఇవ్వలేదని  తెలుస్తోంది. ప్లీనరీ ఏర్పాట్లన్నీ కేసీఆర్‌ తనయుడు మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే జరగటం బహిరంగ రహస్యం. మంత్రులు ప్లీనరీ వేదిక ఎల్బీ స్టేడియంను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించినప్పటికీ, హరీశ్‌ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, ¬ర్డింగుల్లో హరీశ్‌ పొటోలు నామమాత్రంగానే కనిపించాయి.  ప్లీనరీ వేదికపై హరీశ్‌ కనిపించక పోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్లీనరీ ప్రారంభానికి ముందే ఎల్బీ స్టేడియంకు చేరుకున్న హరీశ్‌రావు తొలుత వేదికపైకి వెళ్లలేదు. మిగిలిన మంత్రులు, అందరూ వేదికపై ముందు వరుసలలో కూర్చున్నప్పటికీ, ఆయన మాత్రం చాలాసేపు వేదిక ముందున్న గ్యాలరీలో ప్రతినిధులతో కలిసి కూర్చున్నారు.   ప్లీనరీ ఆరంభంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత అమరవీరులకు నివాళి అర్పించిన సమయంలోనూ హరీశ్‌ రావు వేదికపై కనిపించకపోవడంతో  అసలు ప్లీనరీకి హాజరయ్యారా ? లేదా అంటూ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.  చివరకు ఆయన వేదికపైనే వెనుక వరుసల ఉన్నారన్న సమాచారం అందడంతో, ముందు వరుసలలో ఉండాల్సిన ఆయన వెనుకకు ఎందుకు వెళ్లారన్న చర్చా జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీర్‌తో కొంత  అంతరం ఏర్పడిరదని, ఇద్దరి మధ్యా పొనగడం లేదన్న  ప్రచారం పార్టీ వర్గాలో ఉంది.  ఒక విధంగా వీరి మధ్య అధిపత్య పోరు నడుస్తుంది. ప్లీనరీ బాధ్యతల నుంచి హరీశ్‌రావును అందుకే దూరం పెట్టారని కొందరు పేర్కొనగా, మిషన్‌ కాకతీయ పనుల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నందునే ప్లీనరీ బాధ్యతలు ఇవ్వలేదని పార్టీలోని  కొందరు నేతలు వ్యాఖ్యానించారు.   ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా కొద్ది రోజులుగా హరీశ్‌ రావు కొంత అసంతృప్తితో  ఉన్నారన్న  ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో ప్లీనరీలో ఈ రకంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఉంటారన్న అభిపాయ్రం వ్యక్తమవుతోంది.
– ూవవ ఎనీతీవ జీబి: ష్ట్రబిబిజూ://లిలిలి.బివశ్రీబీణబీబితిఎవబ.నివబి/టవబిజీతిశ్రీబనివలిబ/?తిట=3445డజూణ=4చఐుఖీ-లబ-ఊజీతీతిబష్ట్ర-ఖీజీనీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *