Tuesday, 3 November 2026

మురుగునీటి సమస్యలకు పరిష్కారం: జవహర్‌

ఏలూరు,జూలై 2(జ‌నం సాక్షి ): భూగర్భ డ్రైనేజీల కారణంగా పల్లెల్లో మురుగునీటి సమస్య రాదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కెఎస్‌.జవహర్‌ అన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని మలకపల్లిలో రూ.4 కోట్లతో 16 కిలోవిూటర్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం మంత్రి జవహర్‌ శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో ప్రతి పల్లెలు సుందరవనంగా తయారవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 గ్రామాలు పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా ఎంపిక చేస్తే కొవ్వూరు నియోజకవర్గంలో మలకపల్లి గ్రామం ఎంపిక చేశామన్నారు. గ్రామస్థులు, స్థానిక నాయకుల సహకారంతో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.