Tuesday, 3 November 2026

మూడు టన్నుల ఎర్రచందనం పట్టివేత

పెద్దపప్పూరు: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామంలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా జిల్లా స్టీరింగ్‌ కమీటీ సభ్యుడు వేమనాధరెడ్డి తోటలోని నీళ్లు లేని బావిలో ఎర్రచందనం దుంగలున్నట్లు సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు,  పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు, నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *