న్యూఢల్లీి, జూన్ 23 (జనంసాక్షి) :
అమెరికా కార్యదర్శి జాన్ కెర్రీ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం ఢల్లీికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై నాలుగో విడత చర్చలు జరుపుతారు. అమెరికా భారత్‌లో విద్యుత్ రంగంలో వంద మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో విద్యుత్, ఉన్నత విద్యరంగాలపై చర్చిస్తారు. అమెరికా విద్యుత్ రంగ కార్యదర్శి, నాసా డైరెక్టర్, పస్‌ఫిక్ రీజియన్ మిల్ట్రీ చీఫ్ తదితరులు చర్చల్లో పాల్గొంటారు. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోనూ భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరుపుతారు.
మూడు రోజుల పర్యటకు భారత్‌కు జాన్‌కెర్రీ




