హైదరాబాద్:అకాల వర్షం వల్ల వచ్చిన సమస్యలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. మొత్తం 24 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని విభాగాల అధికారులతో కలసి సమన్వయంగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్న సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడుతూ… నగరంలో మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. అంతే కాకుండా అక్కడక్క భారీ వృక్షాలు నేలకొరిగాయని… ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 20 అత్యవసర బృందాలు సత్వరమే స్పందిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నేటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 040- 21111111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
మెట్రో పనుల వల్ల వాహనదారులకు ఇబ్బందులే:కమిషనర్




