Tuesday, 3 November 2026

మేకలపై దాడి చేసిన చిరుత

నెల్లూరు : ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్థులు చెన్నయ్య, మోహన్‌రావులకు చెందిన మేకలపై దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మరో ఆరు మేకలు చిరుత దాడిలో గాయపడ్డాయి. అటవీ ప్రాంతం కావడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయంతో స్థానికులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *