Friday, 6 November 2026

మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం

mso9c4jgహైద‌రాబాద్ (జ‌నంసాక్షి): మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన్రు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని అన్నరు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చిన్రు. కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలు చూసి మీరే మెచ్చుకుంటారని అన్నరు. 7.5 శాతం పింఛన్లు ముస్లింలకు అందుతున్నాయని చెప్పిన్రు. ఉర్దూ మీడియం పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నరు. ఎప్పుడూ లేని విధంగా మైనార్టీలకు బడ్జెట్లో నిధులు కేటాయించామని తెలిపిన్రు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మైనార్టీకి చెందిన ఖాద్రీకి అవకాశం కల్పించామని గుర్తు చేసిన్రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *