మొదటి ముద్దాయి చంద్రబాబే -వ్యతిరేఖ దీక్షలో వైసీపీ నేత భూమా కరుణాకర్‌రెడ్డి
విశాఖపట్టణం, జనం సాక్షి ) : ప్రత్యేక ¬దా రాకుండా పోవటానికి మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబు అని రెండవ ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అని వైసీపీ నేత భూమా కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యతిరేఖ దీక్షలో భూమా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక ¬దా కోసం వైసీపీ పోరాడుతునే వుందనీ..పోరాటంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందనీ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ప్రత్యేక ¬దా క్రెడిట్ జగన్మోన్ రెడ్డికి వస్తుందని ప్రజల్లో జగన్కు అభిమానం ఏర్పడుతున్నందుకే చంద్రబాబు తాను కూడా దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తానన్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఒప్పుకుని ఏపీ ప్రజలను మోసం చేసారని వైసీపీ నేత భూమా విమర్శించారు. నాలుగేళ్ళ నుండి ప్రత్యేక ¬దా గురించి మాట్లాడని సీఎం చంద్రబాబు ఇప్పుడు ధర్మపోరాట దీక్ష చేపట్టటం రాజకీయ లబ్డి కోసమేనన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతు..బీజేపీ ఒక సిద్ధాంత పరమైనదని కానీ ఇప్పుడు పచ్చి అబద్దాల కోరుగా బీజేపీ వ్యవహరిస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు.