కాట్మాండు, నవంబర్ 25 (జనంసాక్షి) : మోటారు వాహనాల ఒప్పందంపై భారత్, నేపాల్ దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లో ఆమోదించిన మార్గాల్లో వాహనాలు తిరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే విదేశీ పర్యటనలతో వివిధ దేశాలను తన ప్రసంగాలతో ఆకంట్టుకుంటున్న మోడీ పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నేపాల్‌తో మోటార్ వాహనాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో ప్రయాణికులకు, వాహనదారులకు ఊరట కలుగనుంది. భారతదేశానికి చెందిన వాహనాలు ఆ దేశంలో తిరిగే సందర్భంలో పన్నుతో పాటు ఇతర నిబంధనలను ఈ ఒప్పందంతో సడలించినట్లవుతుంది.
మోటార్ వాహనాల ఒప్పందంపై భారత్-నేపాల్ సంతకం





