Tuesday, 3 November 2026

మోడీని ఆకట్టుకున్న చైనా ఎలివేటెడ్ బ‌స్

elevated-busచైనా లోని ట్రాన్సిట్ ఎలివేటెడ్ బ‌స్ (టీఈబీ)పై ఆస‌క్తిగా ఉన్నారు  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. చైనాలో విజ‌యవంతంగా నడుస్తున్న బ‌స్‌ను భార‌తీయ రోడ్ల‌పై ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాలని రోడ్డు ర‌వాణా మంత్రిత్వ శాఖ‌ను ఆదేశించారు. జెయింట్ బ‌స్ గురించిన పూర్తి వివ‌రాలు ఆరా తీయాల‌ని వారికి సూచించారు. హైవేల విస్త‌ర‌ణ‌పై అన్ని మంత్రిత్వ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో నిర్వహించిన స‌మావేశంలో ఈ ఎలివేటెడ్ బ‌స్ గురించి మోడీ ప్రస్తావించారు. ఈ నెల 3న చైనాలోని కిన్‌హువాన్ న‌గ‌రంలో మోడీ ఈ ఎలివేటెడ్ బ‌స్‌ను ప‌రీక్షించారు.  ఈ బస్సును మన దేశ రోడ్లపై ప్రవేశ పెట్టాలనే సంకల్పంతో ఉన్నారు మోడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *