– భీంరావు అంబేడ్కర్ వర్సిటీలో విద్యార్థుల నిరసన
– స్పందించి, విచారం వ్యక్తం చేసిన ప్రధాని
లక్నో:జనవరి22(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో ప్రధాని మోడీకి చేదు అనుభవం ఎదురైంది. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయనకు విద్యార్థుల నుంచి నిరసన ఎదురైంది. సరిగ్గా ప్రధాని మోడీ ప్రసంగించే సమయంలో కొంతమంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు ప్రధాని మోడీకి తమ నిరసన తెలిపారు. ఐతే, ఆందోళన చేస్తున్న విద్యార్థులను భద్రతా సిబ్బంది బయటికి పంపేసింది. ఆ తర్వాత ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన లక్నోలోని అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రధాని స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. భారతమాత ఒక ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి బిడ్డను కోల్పోయిన తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బిడ్డను కోల్పోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.ఈ ఘటనపై లక్నోలో కూడా ప్రధాని నరేంద్ర మోదీని పలు విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించబోతుండగా.. ఆయనకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను భద్రతా సిబ్బంది బయటకు పంపించేశారు. అనంతరం మోదీ తిరిగి ప్రసంగం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మట్లాడుతూ మనం చదివే చదువు వల్ల ఏం ప్రయోజనమన్నది గుర్తించాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. అయితే విద్య ఒక్కటే జీవితంలో సమస్యలకు పరిష్కార మార్గం చూపేది విద్య అని వివరించారు. విద్య ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది తెలుస్తుదని అన్నారు. ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో మేలు చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసిన మహా వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తు చేశారు. విద్యపట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు, సమస్యలెదురవుతాయని ఒక్కొక్క దానిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే జీవిత లక్ష్యం అని తెలిపారు. ప్రతీ వ్యక్తి సమున్నత స్థానానికి చేరుకోవాలన్నదే బాబా సాహెబ్ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆర్థిక విధానాలను విస్మరించి ఈ దేశం ముందుకు వెళ్లలేదని తెలిపారు. తాను చదువుకున్న రోజుల్లో కాగితం దొరికేది కాదని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సమాజంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాగితం పరిశ్రమల్లోనే విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయని వివరించారు. కల్పనను సాకారం చేసే విధానం కఠినమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు చెప్పే విషయాలు కొంత కఠినంగా అనిపిస్తాయని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులను ఇంకా ప్రధాన స్రవంతిలోకి తీసుకురాలేక పోయామన్నారు. స్టార్టప్‌లలో దళితులకు ప్రత్యేక స్థానం కల్పించాలన్నదే తమ ఆలోచన అని మోదీ స్పష్టం చేశారు.





