Thursday, 5 November 2026

మోదీ పాలనపై 26న నిరసనలు

ఏలూరు,మే24(జ‌నం సాక్షి): మోడీ పాలనను వ్యతిరేకిస్తూ 26న నిరసనలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్‌ చెప్పారు. మోడీ అధికరాంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుఉతన్న సందర్బంగా నిరసనతెలియ చేస్తామని అన్నారు. రాష్ట్రానికి  ప్రత్యేక ¬దా ఇవ్వకుండా కేంద్రం చేసిన అన్యాయాన్ని తెలియజెప్పేందుకు కర్ణాటకు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులతో తామంతా తరలివెళ్లామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోదీ చేసిన దుర్మార్గాలను అక్కడి ప్రజలకు తెలియజేశామన్నారు. మోదీ నాలుగేళ్ల పాలన పూర్తవుతున్నందున ఈనెల 26న అన్ని మండల నియోజకవర్గ స్థాయిలో అన్ని మండల, నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుష్టపాలనకు చరమగీతం పాడటానికి కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటు తొలి అడుగని అన్నారు.  2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారం సాధించడం ఖాయమని బేగ్‌ చెప్పారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణకూటమి ఆధ్వర్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మోడీ ప్రభుత్వానికి ఇక కౌంట్‌ డౌన్‌ మొదలయ్యిందన్నారు.