మ్యాచ్ ఫిక్సింగ్‌కు ‘స్పాట్’ పెట్టిన పోలీసులు
శ్రీశాంత్, అంకిత్, చండీలా అరెస్ట్
రెడ్ హ్యాండెడ్‌గా బుక్ అయిన క్రికెటర్లు, బుకీలు
అండర్‌గ్రౌండ్ మాఫియాతో లింకు
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :
క్రికెట్‌లో మరోసారి జడలు విప్పిన ఫిక్సింగ్ భూతానికి పోలీసులు స్పాట్ పెట్టారు. జెంటిల్మన్ గేమ్‌కు మాస్ మసాలా జోడించి పక్కా కమర్షియల్ గేమ్‌గా మార్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ గురువారం వెల్లడించారు. విచారణలో తమకు దీనికి తగ్గట్టు కొన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లైన ఈ ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. శ్రీశాంత్ తండ్రి చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. బుకీలకు, ఆటగాళ్లకు మధ్య శ్రీశాంత్ పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఆస్టేల్రియా ప్లేయర్ షాన్ టైట్‌ను కూడా అనుమానిస్తున్నట్టు తెలిపారు. పంజాబ్‌తో మొహలీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు కమీషనర్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కూడా ఆయన మీడియాకు చూపించారు. బుకీలతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక ఓవర్‌లో 14 కంటే ఎక్కువ పరుగులు ఇస్తే ఆటగాడికి రూ.60 లక్షలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఫిక్సింగ్ చేయడానికి ముందు ఒక సైగ ద్వారా బుకీని ఆటగాళ్లు అలెర్ట్ చేసేవారని వివరించారు. చేతికున్న వాచీని ఒకసారి తిప్పుకోవడం, ఒక టవల్‌ను ప్యాంట్‌లో పెట్టుకోవడం, క్యాప్ తీసి రెండుసార్లు పెట్టుకోవడం వంటి సైగల ద్వారా బుకీలను మేనేజ్ చేసేవారని వివరించారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పాడ్డాడని తెలిపారు. అతని రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, తద్వారా 60 లక్షల రూపాయలు తీసుకున్నట్టు చెప్పారు. పుణె వారియర్స్‌తో మే 5న జరిగిన మ్యాచ్‌లో చందిలా తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం బుకీకి ముందుగా సిగ్నల్ ఇవ్వడం మరిచిపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బుకీలు డిమాండ్ చేశారు.
ఐపీఎల్‌కు మళ్ళీ ఫిక్సింగ్ మరక
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మరోసారి ఫిక్సింగ్ మరక అంటుకుంది. గతంలో స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే ఈ సారి ఆటగాళ్ళు నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ జరిగిన మ్యాచ్‌కు సంబంధించి భారీగా బెట్టింగ్ జరుగుతోందని రావడంతో ఏడుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన బుకీల ద్వారా పోలీసులకు నమ్మలేని విషయాలు తెలిసాయి. విచారణలో బుకీలు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురి క్రికెటర్ల పేర్లు చెప్పడంతో ఫిక్సింగ్ డొంక కదిలింది. దీని ప్రకారం ఆటగాళ్ళ టెలిఫోన్ కాల్స్ డేటా పరిశీలించిన తర్వాత పోలీసులు ఫిక్సింగ్ జరిగినట్టు నిర్థారణకు వచ్చారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండిలాను అరెస్ట్ చేశారు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటగాళ్లు అరెస్టవడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి. బుకీలు ఇచ్చిన సమాచారం ప్రకారం గత రాత్రి జరిగిన ముంబై ఇండియన్స్, రాజస్థాన్ మ్యాచ్‌లో కూడా ఫిక్సింగ్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఓవర్‌కు 20 పరుగులు ఇస్తే రూ.60 లక్షల వరకూ చెల్లిస్తామని బుకీలు ఆశ చూపడంతో క్రికెటర్లు ఫిక్సింగ్ వలలో పడినట్టు తెలుస్తోంది. ముంబైతో మ్యాచ్ ముగిసిన వెంటనే ¬టల్ ట్రిడెంట్‌కు వెళ్లిన పోలీసులు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అటు తమ ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టవడంపై రాజస్థాన్ రాయల్స్ షాక్‌కు గురైంది. వెంటనే ఆ ఫ్రాంచైజీ ఓనర్ శిల్పాశెట్టి స్పందించి పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అయితే ఆటకు మచ్చ తెచ్చే విధంగా ఫ్రాంచైజీ ఎటువంటి కార్యాకలాపాలను ప్రోత్సహించదని స్పష్టం చేసింది. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు వచ్చిన ముగ్గురు ఆటగాళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఈ ఫిక్సింగ్ వివాదంపై విచారణ జరిపే బాధ్యతను క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. వారిపై ఆరోపణలు రుజువైతే జీవితకాల నిషేధం విధించేందుకు కూడా వెనుకాడమని బోర్డు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం వెనుక పెద్ద కుట్రే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై, రాజస్థాన్ మ్యాచ్ జరుగుతోన్న సమయంలో బుకీలకు పాకిస్థాన్, దుబాయ్ నుంచి కాల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దాదాపు 30 నుంచి 60 వరకూ కాల్స్ రావడంతో దీని వెనుక దావూద్ ఇబ్రహీం హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నా