Tuesday, 3 November 2026

యాదగిరీశుడి సన్నిధిలో సీఎం దంపతులు

2

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి బ్రహ్మోత్సవ శోభతో పులకించిపోతోంది. నరసింహస్వామి దివ్యక్షేత్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు భక్తకోటి పెద్దెత్తున తరలివస్తున్నారు. స్వామి సేవలో తరించేందుకు సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 11 గంటలకు యాదాద్రికి విచ్చేశారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు ఎమ్మెల్యేలు యాదగిరి గుట్టకు వచ్చారు.

ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు లక్ష్మీ నారసింహుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు స్వామివారిని సేవించుకున్నారు. నర్సన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ ను సత్కరించి… తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్ మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడ్నుంచి తిరుగు పయనమయ్యారు. మరోవైపు ఈ రాత్రికి లక్ష్మీ నారసింహుడి కల్యాణోత్సవం జరగనుంది. గవర్నర్ దంపతులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనబోతుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *