Tuesday, 3 November 2026

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. గంటల కొద్దీ నిరీక్షించి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వ్రత మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ శివాలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. నిత్య పూజల్లో భాగంగా ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, అర్చనలు నిర్వహించారు. మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు కల్యాణం చేశారు.8brk78b

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *