Monday, 2 November 2026

యువతిపై సామూహిక అత్యాచారం

కావలి మున్సిపాలిటీ: నెల్లూరుజిల్లా కావలి పట్టణానికి చెందిన 17ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు బాధితురాలికి డబ్బులు బాకీ ఉన్నాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి మరో వ్యక్తి కిషోర్‌తో కలిసి మంగళవారం రాత్రి కావలి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు బుధవారం ఉదయం రెండో పట్టణ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *