Monday, 2 November 2026

యూరిన్ తో బీర్ తయారీ

beerబీర్ అంటే అందరికీ లైకే. ఆల్కహాల్‌ చాలా తక్కువ మోతాదులో ఉన్నందున బీర్‌ను చాలా మంది ఇష్టడతారు. బీర్‌ పట్ల ఆడా, మగా అందరూ ఆకర్షితులవుతున్నారు. రకరకాల ఫ్లేవర్లలో బీర్‌లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మరో రకం బీర్‌ రంగ ప్రవేశం చేయనుంది. ఈ బీర్‌ను దేనితోని తయారు చేస్తారో తెలుసుకుంటే షాక్ కు గురవుతారు. ఎందుకంటే ఈ బీర్ యూరిన్‌తో తయారవుతోందని బెల్జియంలోని బెల్జియంలోని ఘెంట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. యూరిన్ ను సోలార్‌ ఎనర్జీ ద్వారా నీరుగా మార్చే యంత్రాన్ని వారు కనుగొన్నామని తెలిపారు.

ఇందులో మొదట యూరిన్‌ను ఓ పెద్ద ట్యాంక్‌లో స్టోర్‌ చేస్తారు. సోలార్‌ పవర్‌తో పనిచేసే బాయిలర్‌లో వేడిచేసి పొంగకుండా దానిని ప్రవహింపచేస్తారు. దీని వల్ల ఆ యూరిన్‌.. పొటాషియం, నైట్రోజన్‌, పాస్ఫరస్‌, నీరుగా విడిపోతుంది. ఆ నీరును ప్రాసెస్‌ చేసి మంచి టేస్టీ బీర్‌గా తయారు చేస్తామన్నారు పరిశోధకులు. ఇక యూరిన్‌ నుంచి వేరు చేసిన పొటాషియం, నైట్రోజన్‌, పాస్పరస్‌ వంటి ఖనిజ లవణాలను పొలంలో ఎరువులుగా కూడా వాడుకోవచ్చని తెలుపుతున్నారు. ఈ మధ్య ఘెంట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మెషిన్‌ను ఉంచి దాదాపు వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించామని అన్నారు. దీనిని ప్రాసెస్‌ చేసి రకరకాల ఫ్లేవర్లలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు వీళ్లు. ఈ బీర్‌ ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదని వారు వెల్లడించారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *