Wednesday, 4 November 2026

యోగాసనాలతో వ్యాధులు దూరం

గుంటూరు (నల్లచెరువు) : యోగాసనాలు శరీరానికి చక్కని వ్యాయామంగా ఉపకరిస్తాయని, అనేక వ్యాధులను శరీరం నుంచి దూరం చేయడంలో ఆసనాలు కీలక భూమిక పోషిస్తాయని యోగాచార్యులు ఇందుశేఖర్‌ అన్నారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ‘యోగాసనాలు, వ్యాధులు’ దూరం అన్న అంశంపై ఆదివారం జరిగిన శిబిరంలో ఆయన మాట్లాడారు. నేటి యాంత్రిక జీవనంలో యోగాసనాలు మానవుడికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. అనంతరం ఆయన యోగసనాలు వేసి చూపారు. ఏ వ్యాధికి ఏ ఆసనం ఉపకరిస్తుందో ఉదహరించారు. కార్యక్రమంలో కార్యదర్శి శివరామిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *