Wednesday, 4 November 2026

రఘువీరాపై రాళ్లు మట్టిపెళ్లలు విసిరిన గ్రామస్థులు

మచిలీపట్నం, సెప్టెంబర్ 13: బందరు పోర్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. మచిలీపట్నం మండలం కోన గ్రామంలో గత రాత్రి టీడీపీ నేతలను మాట్లాడనివ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు కూడా రావడానికి వీల్లేదంటూ ఒక వర్గం అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆయనపై రాళ్లు, మట్టిపెళ్లలు విసిరారు. ఈ ఘటనతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రఘువీరాను గ్రామంలో నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *