రష్యాలో హెలికాప్టర్‌ కూలి 13మంది దుర్మరణం

మాస్కో,ఆగస్ట్‌12(జనం సాక్షి): రష్యాలో హెలికాప్టర్‌ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున కూలిపోయిందని, ఆ సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితోపాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక విూడియా తెలిపింది. మి`8 హెలికాప్టర్‌ రష్యాలోని తూర్పున ఉన్న కమ్చట్కీ ద్వీపకల్పంలోని కురిల్‌ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్‌ పెట్రోపావ్లోన్స్‌ ` కమ్చట్కీ నగరానికి సవిూపంలో ఉన్న ఖోడుట్కా అగ్నిపర్వతాన్ని సందర్శించేందుకు పర్యాటకులను తీసుకువెళుతోంది. సమాచారం అందుకున్న వెంటనే 40 మంది సహాయక బృందం అక్కడికి చేరుకుని.. తొమ్మిదిమందిని కాపాడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో ఏడుగురి కోసం గాలిస్తోందని.. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపింది. కాగా కమ్చట్కీ చాలా తక్కువ మంది జనాభా నివసించే పెద్ద భూభాగం అయితే, ఇక్కడి అగ్నిపర్వతాలు, ప్రకృతి దృశ్యాలను సందర్శించేందుకు తరచూ పర్యాటకులు వస్తుంటారు.