తిరుమల, జనంసాక్షి: ప్రకాశం జిల్లా ఇంకొల్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ శనివారం తిరుమలలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలుగా తనతో ప్రేమగా ఉంటూ పెండ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడ్డాడంటూ విజయ్‌కుమార్‌పై భట్టిప్రోలు మండలం వెల్లటూరుకి చెందిన అనుప్రవల్లిక కొద్దిరోజుల క్రితం బాపట్ల డీఎస్సీ భాస్కర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఎస్‌ఐపై కేసు నమోదు కూడా అయ్యింది. అయితే వాటన్నింటి ఖాతరు చేయని విజయ్ కుమార్ మరో యువతిని ఈ రోజు ఉదయం వివాహం చేసుకున్నాడు.




