రాజకీయ వ్యభిచారం చేసిన వ్యక్తి చంద్రబాబు
– నాలుగేళ్లైనా వంశధార ఫేజ్ -2 పూర్తిచేయలేకపోయారు
– ఎన్నికలెప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధం
– విలేకరుల సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
శ్రీకాకుళం, జూన్25(జనం సాక్షి ) : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యాన్నించారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సాయిరెడ్డి సోమవారం విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా వంశధార పేజ్-2 పూర్తి చేయలేకపోయారన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు శ్రద్దంతా అవినీతి పైనే ఉందని ఆరోపించిన సాయిరెడ్డి… భోగాపురం టెండర్లు ఖరారైన తర్వాత రద్దు చేయించారని విమర్శించారు. ఇక నాలుగేళ్లలో చంద్రబాబు, లోకేష్ కలిసి మూడులక్షల కోట్లకు పైగా దోచుకున్నారని మండిపడ్డ ఆయన… విదేశాల్లో దాచుకున్న డబ్బు సరిపోక ఇంకా దోచుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబును ఇంటికి సాగనంపేందుకు జనం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పొత్తుల విషయంలో మా నాయకుడు జగన్ దే తుదినిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటుంటే కేంద్రం చూస్తూ ఊరుకుందని ఆరోపించిన ఆయన… ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అదే చేస్తోందన్నారు. చద్రబాబులా రోజుకో మాట మాట్లాడే అలవాటు తమకు లేదని… ప్రత్యేక¬దాకు ఎవరు సహకరిస్తే వారికే మా మద్దతు అని స్పష్టం చేశారు. రాజీనామాలు చేసిన ఎంపీలు ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు సాయిరెడ్డి.