కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు పోటెత్తారు. మూడవ శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. రాజరాజేశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు, కల్యాణాలు, అన్నపూజలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు




