Monday, 2 November 2026

ల్పాయ్ గురి జిల్లాను ముంచెత్తుతున్న వరదలు

7i24l2a9పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో జిల్లా అంతటా వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా వరదనీరు ప్రవేశించింది. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శాస్త్రి సీమా బల్ జవాన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *