ఏలూరు,మార్చి3(జనంసాక్షి): గోదావరి పుష్కరాల పనులపై రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమావేశానికి హాజరుకానున్నారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సవిూక్షిస్తారు. గతంలో ఓ మారు దీనిపై సమావేశం నిర్వహించి అనేక అంశాలను చర్చించారు. మరోమారు ఇందులో నిర్ణయాలు తీసుకుంటారు. ఇదిలావుంటే గోదావరి పుష్కరాలకు చేపట్టే ఏర్పాట్లపై అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆర్డీవో ఆదేశించారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై సవిూక్ష సమావేశం నిర్వహించాప్రతి ఘాట్‌ను పరిశీలించి యాత్రికులు పుణ్యస్నానాలు చేసేందుకు, పిండ ప్రదానాలు చేసుకోవడానికి వీలుగాప్రణాళిక సిద్ధం చేయాలనిసూచించారు. తాగునీరు,మరుగుదొడ్లు, పూజా సామగ్రి విక్రయశాలలతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల నుంచి ఘాట్‌ల వద్దకు బస్సులు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తున్నామన్నారు. యాత్రికులకు స్పష్టంగా తెలిసేలా సమాచార బోర్డులు, ప్రతిఘాట్‌కు ఒక యూనిక్ ఐ.డి.నెంబర్ కేటాయించాలని దేవాదాయ శాఖాధికారులకు సూచించారు.




