Tuesday, 3 November 2026

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాటు: డీఈవో

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈఏడాది పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో ఆర్‌.నరసింహారావు వెల్లడించారు.పరీక్షల నిర్వహణకు 317 మంది ఛీప్‌ సూపరింటెండెంట్‌లను నియమించినట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యేవారంతా తమ హాల్‌టిక్కెట్లపై గెజిటెడ్‌ ఉపాధ్యాయులతో సంతకం చేయించుకుని తీసుకురావాలన్నారు. పరీక్షలు బార్‌కోడింగ్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు. ఉపాధ్యాయులు కూడా పరీక్షలపై విద్యార్థులకు పూర్తి అవగహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 317 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన మండలాల్లో ఆరు పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 69,500 మంది పరీక్షలకు హాజరువుతున్నట్లు చెప్పారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 65,642 ఉండగా బాలురు 32,530మంది, బాలికలు 33,112 మంది, ప్రైవేటు విద్యార్థులు 3,858 మందికి గాను బాలురు 2,378, బాలికలు 1480 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *