Tuesday, 3 November 2026

రాజీవ్‌ పేరు మార్చితే ఊరుకోం : దిగ్విజయ్‌

5

హైదరాబాద్‌, నవంబర్‌ 23 (జనంసాక్షి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు మార్చితే ఊరుకోబోమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ హెచ్చరించారు. శంషాబాద్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టే అంశంపై కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు. ఒకే టెర్మినల్‌ కు, ఒకే బిల్డింగ్‌ కు రెండో పేరు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్‌ మాట్లాడారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. ఈ అంశంపై కూడా కోర్టుకు వెళతామన్నారు. ఫిరాయింపు నిరోధక పిటిషన్‌ లను స్పీకర్లు, ఛైర్మన్లు గడువులోగా పరిశీలించేలా చట్టాన్ని సవరించాలన్నారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందని దిగ్విజయ్‌ విమర్శించారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీ చేసే యోచనలో ఉందన్నారు.  డిసెంబర్‌ 9 నుంచి 16 వరకూ నేతలంతా ఓటు హక్కు ఉన్న పోలింగ్‌ బూత్‌ లోనే సభ్యత్వ నమోదు నిర్వహించాలన్నారు. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పోటీ చేయబోతోందని అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని డివిజన్లలో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి మతతత్వ శక్తులతో శక్తులతో పోరాడుతూనే ఉందని దిగ్విజయ్‌ గుర్తుచేశారు. తనకు వైల్డ్‌ ఫోటో గ్రఫీ అంటే ఇషమని రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆదివారం సాక్షితో మాట్లాడిన దిగ్విజయ్‌.. వన్య ప్రాణుల సంరక్షణే తన ఫోటోగ్రఫీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను కాపాడగలిగితే వన్యప్రాణులను కాపాడుకోగలమని ఆయన అన్నారు.హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్‌ వెంకట్‌ ఫోటో గ్రఫీలో తనకు గురువని దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ఏఐసీసీ మైనారీటీ సెల్‌ చైర్మన్‌ ఖుర్షీద్‌ అహ్మద్‌, రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, కార్యదర్శి ఆర్‌.సి. కుంతియాలు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *