కాకినాడ,నవంబర్5(జనంసాక్షి): వార్షిక తనీఖీల్లో భాగంగా అమలాపురం డిఎస్పి ఎ.వి.ఎల్ ప్రసన్న కుమార్ సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ ను తనిఖి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరును, రాజోలు పోలీసు స్టేషన్ లో నమోదు చేసిన కేసులు పురోగతి, దర్యాప్తు వివరాలను సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులు నిందితుల అరెస్టు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిత్యం నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకొని చేయాల్సిన పనులను ప్రజలకు పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకాన్ని కల్పించడానికి చేయాల్సిన విధులను డిఎస్పి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎస్‌ఐ ఎం.నాగరాజు, ట్రైనింగ్ ఎస్‌ఐ హెచ్.శాస్త్రీ, ఎఎస్‌ఐ భగవాన్ నారయణ, గణెళిష్ సిబ్బంది పాల్గొన్నారు.




