Tuesday, 3 November 2026

రాజ్యంమారిన రాజ్య‌హింస ఆగ‌లేదు

1bts9hp7శృతిపై అత్యంత పాశవికంగా సామూహిక
హైదరాబాద్‌ : రాజ్యం మారినా రాజ్యహింస ఆగలేదని మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని తేలిపోయిందని, ప్రభుత్వం ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి క్షమాపణ చెప్పడం ద్వారా ఇది బూటకమని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లైందని ఆమె అన్నారు.
మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన ప్రభుత్వం, ఈ ఎన్‌కౌంటర్‌పై తక్షణం విచారణకు ఆదేశించాలని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. మావోయిస్టు శృతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, అవయవాలపై యాసిడ్‌ దాడి చేసి కిరాతకంగా హతమార్చారని విజయశాంతి ఆరోపించారు. ఈ అమానవీయమైన ఘాతుకంపై విచారణ జరిపి బాధ్యుల కళ్లు పీకుతారో, ఇతర చర్యలేమి తీసుకుంటారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *