Wednesday, 4 November 2026

రాజ్యసభలో కొనసాగిన కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన డిప్యూటీ ఛైర్మన్‌ పొడియంను చుట్టుముట్టిన ఎంపీలు

caqpwe06న్యూఢిల్లీ, ఆగస్టు 12 : రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు బుధవారం కూడా ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభం కాగానే కొద్ది సేపటిలో కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. లలిత్‌మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాలని పట్టుపడుతూ గందరగోళం సృష్టించారు. ప్రధానమంత్రి ప్రకటన కోసం కాంగ్రెస్‌ మరోసారి డిమాండ్‌ చేసింది. అయితే ముందు రోజు కూడా అదే అంశాన్ని ప్రస్తావించినందున ఈరోజు దానిని పరిగణలోకి తీసుకోలేమని డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *