Wednesday, 4 November 2026

లలిత్‌కు సాయం చేసినట్లు సుష్మా ఒప్పుకున్నారు మా వాదన ప్రధాని విని…సమాధానం చెప్పాలి : ఖర్గే

న్యూఢిల్లీ, ఆగస్టు 12 : లలిత్‌మోదీకి సాయం చేసినట్టు సుష్మానే ఒప్పుకున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. లలిత్‌మోదీపై ఇంటర్‌పోల్‌, రెడ్‌ కార్నర్‌ నోటీసు ఉన్పప్పటికీ సుష్మా సహకరించారని తెలిపారు. ఓ ఆర్థిక నేరస్తుడికి సుష్మా స్వరాజ్‌ సాయం చేశారని ఆయన ఆరోపించారు. బుధవారం లలిత్‌మోదీ వివాదంపై లోక్‌సభలో చర్చను ఖర్గే ప్రారంభించారు.
చర్చకు ముందే సమయం కేటాయించి ఉంటే సభా సమయం వృధా కాకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. లలిత్‌ మోదీపై తమ హయాంలో చిదంబరం కఠినంగా j5uy2f6kవ్యవహరించారని గుర్తుచేశారు. లలిత్‌మోదీ లాయర్లు సుష్మా కుటుంబసభ్యులే అని అన్నారు. సుష్మా సాయం చేయాలకునుంటే చట్టం పరిధిలో చేయాల్సింది…విదేశాంగశాఖ అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగిందని ఆరోపించారు.
ప్రధాని మోదీ సభకు రావాలని డిమాండ్‌ చేసిన ఖర్గే ప్రధాని తమ వాదనను వినాలి…సమాధానం చెప్పాలన్నారు. విషయం పక్కదారి పట్టించడానికే సెక్షన్‌ 193 కింద చర్చకు అనుమతించారని మండిపడ్డారు. ఆధారాలు ఏమీ లేకుండా సుష్మా జాగ్రత్త పడ్డారని ఖర్గే వ్యాఖ్యానించారు. లలిత్‌మోదీని భారత్‌కు ఎందుకు రప్పించడం లేదని ప్రశ్నించారు. లలిత్‌కు ప్రభుత్వం అండగా ఉందా అని నిలదీశారు.
లలిత్‌కు సాయం చేసినట్లు సుస్మా ఒప్పుకున్నందునే ఆమె రాజీనామా కోరుతున్నామని చెప్పారు. మానవతా దృక్పథంతో సాయమన్న వాదన సరికాదని మల్లికార్జున ఖర్గే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *