Wednesday, 4 November 2026

రాజ్యాంగ నిర్మాతకు సీఎం నివాళులు

chci95x3 హైదరాబాద్:

రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ స్పూర్తితో పనిచేసి బంగారు తెలంగాణ నిర్మిస్తామన్నారు రాష్ట్ర మంత్రులు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటపాడి అంబేద్కర్‌కు నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *