Monday, 2 November 2026

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్

ktr-facebook-3x2-newకేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తేజావత్, వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ కూడా హాజరయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలోని 4 మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు రూ. 1,290 కోట్లు కోరామని తెలిపారు.రెండేళ్లుగా నిధుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. త్వరగా కేంద్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కోరామని తెలిపారు. నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు చేపడుతామని మంత్రులు పేర్కొన్నారు. వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్ చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో 2,600 కి.మీ. రహదారుల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *