రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం
గుంటూరు,మే9(జనం సాక్షి): సిపిఎం సీనియర్ సభ్యులు, గుంటూరు నగర మాజీ కార్యదర్శి కొండా రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమానికి తీరని లోటని సిపిఎం నాయకులు అన్నారు. సిపిఎం సీనియర్ సభ్యులు, గుంటూరు నగర మాజీ కార్యదర్శి కొండా రామిరెడ్డి భౌతిక కాయానికి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, డి. రమాదేవి నివాళులర్పించారు. రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.