రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారు: యనమల

కాకినాడ,మే14(జ‌నం సాక్షి): కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. సీఎం చంద్రబాబు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు కొనియాడారు. కేందరం తన బాధ్కయత విస్మరించి రాస్ట్రానికి సాయం అందించడం లేదన్నారు. విభజన హావిూలు అమలు చేయకుండా ప్రబుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోందని అన్నారు.  రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని, ప్రాజెక్టుల్లో అవినీతి పేరుతో విపక్షాలు, రిటైర్డ్‌ అధికారులు.. కేంద్రానికి లేఖలు రాయడం కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. పిఠాపురంలో టీడీపీ మినీమహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ¬ం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే వర్మ హాజరైనారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ప్రగతికి అంకితం అయ్యిందన్నారు. 

తాజావార్తలు