Monday, 2 November 2026

రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు :తమ్మినేని..

b9rnzf6qహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనను నిరసిస్తూ ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుకు తెరలేపింది. ఈసందర్భంగా టెన్ టివితో తమ్మినేని మాట్లాడారు. ఎన్ కౌంటర్ ఘటనపై నిజాయితీ ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అక్కడ నిగ్గు తేల్చాలన్నారు. 371 సంఘాల్లో ఏ సంఘం నిషేధితమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి నేరస్తుడా ? ప్రజల కోసం పోరాడుతున్న వారు నేరస్తులో అసెంబ్లీ వేదికగా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ పతనానికి నాంది అని, చలో అసెంబ్లీని అడ్డుకోవాలని ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఈ విషయంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజాస్వామ్య హక్కులకు ఉల్లంఘన జరిగినా నిరంతరం పోరాటం జరుపుతామని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో చర్చకు అనుమతినిచ్చినా తేలుతుందని, లేదా అసెంబ్లీలో చర్చ పెట్టినా తేలుతుందన్నారు. హతులైన వారి శరీరాలు చిత్ర హింసలకు గురయ్యాయని, చేతి వేళ్లు నరకబడ్డాయని పేర్కొన్నారు. చిత్ర హింసలు పెట్టి చంపింది కాదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ దోషిగా నిలబెడుతోందని, ప్రజల్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టించేందుకు అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదని తమ్మినేని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *