Wednesday, 4 November 2026

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

hxqyliijబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతుండటంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అత్యధికంగా 10.6 సెం.మీ.ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షానికి మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌కు కా లం కలిసొచ్చినట్లయింది. నల్లగొండ జిల్లాలో 56 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 104.6 మిమీ, త్రిపురారం 100.6, దామరచర్ల 64.2, గరిడేపల్లి 62.2, పోచంపల్లి 56.4, వేములపల్లి 50, తుర్కపల్లి 49.2, మునగాల 47.2, నేరేడుచర్ల 44.6, వలిగొండ 42.2, నిడమనూరు 43.2మిమీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 23.5 మిమీ వర్షం కురిసింది. నవీపేటలో అత్యధికంగా 55.0 మిమీ, ఆర్మూర్ 54.2, బాల్కొండ 54, వేల్పూర్ 41.4, మాక్లూర్ 32.4, రెంజల్ 37.2, మద్నూర్ 25.2, బిచ్కుంద 23.6, మాచారెడ్డి 43.6, కామారెడ్డి 31.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ జల్లులు కురిశాయి. నిర్మల్ మండలంలో 91.08 మిమీ వర్షం పడింది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 17.02 మిమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట మండలంలో అత్యధికంగా 67.0 మిమీ వర్షం పడింది. కొడంగల్, అలంపూర్, గద్వాల నియోజకవర్గంలో భారీ వర్షం పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్, పటాన్‌చెరు, గజ్వేల్‌లో వర్షం కురిసిం ది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది.

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. మరో వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మో స్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *