రాహుల్‌గాంధీపై బూటు విసిరిన వ్య‌క్తి

rahulshoearrestసీతాపూర్ (యూపీ): కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంది. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌పై.. ఓ వ్య‌క్తి బూటు విసిరాడు. అయితే ఈ బూటు దాడి నుంచి రాహుల్ తృటిలో త‌ప్పించుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ బూటు రాహుల్ వెన‌కాలే ఉన్న వ్య‌క్తి చేతికి త‌గిలింది. త‌న‌వైపు బూటు విస‌ర‌డాన్ని రాహుల్‌గాంధీ గ‌మ‌నించారు. ఈ దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు వెంట‌నే అరెస్ట్ చేశారు.