బ్రిటన్ కు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ‘రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్’ భారత నుంచి వైదిలిగే ప్రక్రియను క్రమంగా అమలు చేస్తోంది. తాజాగా ఆ బ్యాంక్ భారత్లో తనకున్న పది రిటైల్ బ్యాంకింగ్ శాఖలను మూసివేయడాన్ని ప్రారంభించింది. గత ఏడాది ప్రకటించిన ప్రణాళికలకు అనుగుణంగానే బ్యాంక్ భారత్లో తన శాఖల మూసివేతకు తెర తీసినట్లు సమాచారం. ‘భారత్లో బ్యాంకింగ్ విషయమై పలు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన పిమ్మట ఆర్బీఎస్కు చెందిన కార్పొరేట్, సంస్థాగత, రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా’ బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కార్పొరేట్, సంస్థాగత వ్యాపారాల నుంచి వైదొలిగే ప్రక్రియకు తాము ఈ ఏడాది తొలి భాగంలో శ్రీకారం చట్టినట్లుగా ఆయన వివరించారు. తాజాగా రిటైల్ బ్యాంకింగ్ను కూడా మూసివేసే ప్రక్రియను మొదలు పెట్టినట్లుగా ఆయన తెలిపారు.
రిటైల్ బ్యాంకింగ్ కు ఆర్బీఎస్ గుడ్ బై





