మోదీ ఆహ్వానం.. ఒప్పుకున్న ఒబామా
న్యూఢిల్లీ, నవంబర్ 21 (జనంసాక్షి) : వచ్చే సంవత్సరం రిపబ్లిక్ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రానున్నారు. మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన భారత్ వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరుకానున్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఒబామాను ఆహ్వానించారు. ఇందుకు ఒబామా అంగీకరించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఒబామాను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినట్టు అంతకుముందు నరేంద్రమోదీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని ¬దాలో అమెరికా పర్యటించిన మోదీ… ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో వైట్‌హౌస్‌లో విందుకు హాజరయ్యారు. ఇటీవల విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడిపిన మోడీ పర్యటనలో భాగంగా రిపబ్లిక్ ఉత్సవాలకు అతిథులను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని ప్రకటించిన మోడీ విదేశీ పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ పరిచారు. మోడీ పర్యటనతో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు రానున్నట్లుగా తెలుస్తోంది.





